News February 28, 2025

పోలీస్ బందోబస్తు నడుమ ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

image

బాపట్ల జిల్లాలో పోలీస్ బందోబస్తు నడుమ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డుడి తెలిపారు. బాపట్ల జిల్లాలోని 34 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. జిల్లాలో 270 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించి ఎన్నికల ప్రశాంతంగా జరగడానికి కృషి చేశారని చెప్పారు.

Similar News

News February 27, 2026

ఏయూలో మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై కఠిన చర్యలు: లోకేశ్

image

గత ప్రభుత్వంలో ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో మండిపడ్డారు. వర్సిటీలో అక్రమ నియామకాలపై మ్యాన్ పవర్ ఆడిట్ చేస్తున్నామని, నెల రోజుల్లో అనర్హులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆడిట్ తర్వాతే కాంట్రాక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరణపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విజిలెన్స్ నివేదిక రాగానే కఠిన చర్యలు తప్పవన్నారు.

News February 27, 2026

BREAKING: అకౌంట్లలోకి డబ్బులు

image

TG: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ బిల్లులు రూ.745 కోట్లను విడుదల చేసింది. వెంటనే వారి అకౌంట్లలో జమ చేయనుంది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలో భాగంగా గత ఏడాది జూన్ నుంచి ప్రతి నెలా దాదాపు రూ.700 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తోంది. మరోవైపు గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు మరో రూ.389 కోట్లను రిలీజ్ చేసింది.

News February 27, 2026

కడప జిల్లాలో రూ. 2 కోట్లు పట్టివేత

image

కడప జిల్లా ఎర్రగుంట్లలో దాదాపు రూ.2 కోట్లకు పైగా నగదు తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ప్రకారం అతను ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన బంగారు వ్యాపారస్థుడని తెలుస్తోంది. నగదు మూలం ఏమిటి, సంబంధిత బిల్లులు చూపించాలని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.