News February 2, 2025
పోలీస్ వృత్తి అంటేనే ఓ గొప్ప సేవ: ఎస్పీ

పోలీస్ వృత్తి అంటేనే ఒక గొప్ప సేవ అని, సమాజానికి మనం చేసిన సేవలు దగ్గరగా చూడటానికి ఏకైక వృత్తి అంటే పోలీస్ వ్యవస్థ అని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ధర్మవరం టూ టౌన్ కానిస్టేబుల్ రామగిరి, రామలింగారెడ్డి, ఏఆర్ ఎస్‌ఐ సుబ్బరంగయ్య పదవీ విరమణ సందర్భంగా వారిని ఎస్పీ ఘనంగా సన్మానించారు. పోలీస్ వ్యవస్థలో బాగా పనిచేస్తే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు.
Similar News
News February 23, 2026
విజయవాడలో ప్రజాప్రతినిధుల మధ్య క్రీడా పోరు..!

ఇందిరాగాంధీ స్టేడియంలో MLA, MLCలకు ఈ నెల 24 నుంచి 3 రోజులపాటు పలు క్రీడాంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. పరుగు పందెం, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, టెన్నికాయిట్, త్రో బాల్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్, షాట్‌పుట్, క్యారమ్స్, క్రికెట్, పికిల్ బాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. మహిళా ప్రజాప్రతినిధులకు మ్యూజికల్ ఛైర్ పోటీలు ఉంటాయన్నారు.
News February 23, 2026
ఖమ్మం ఎంసీహెచ్‌లో తగ్గుతున్న ప్రసవాలు

ఒకప్పుడు నెలకు వెయ్యికి పైగా డెలవరీలతో రికార్డు సృష్టించిన ఖమ్మం MCH ప్రస్తుతం వెలవెలబోతోంది. వైద్యుల సమయపాలన లోపం, పర్యవేక్షణ కరువవ్వడంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కలెక్టర్ సమీక్ష నిర్వహించి.. గైనకాలజీ విభాగం వైద్యులు సమయపాలన పాటిస్తూ, పర్యవేక్షణ పెంచాలని గట్టిగా ఆదేశించారు.
News February 23, 2026
అనకాపల్లి: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని మోడల్స్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. విద్యార్థులు ఈనెల 23 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాలల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.


