News August 18, 2024

పోలీస్ వ్యవస్థపై గౌరవం పెరిగేలా పనిచేయాలి: ఎస్పీ

image

సైబర్ క్రైమ్స్, మహిళలపై జరిగే దాడుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసు అధికారులకు తూర్పు గోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద నెలవారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలలో పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవం, అవిశ్వాసం పెంపొందించే విధంగా పనిచేయాలని సూచించారు.

Similar News

News August 24, 2025

‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా నిర్దేశించిన పనితీరు సూచికలను (KPI) ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం బొమ్మూరు కలెక్టరేట్‌లో కేపీఐ లక్ష్యాలు, వాటి సాధనపై ఆమె సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలు, వాటి సాధనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలపాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.

News August 23, 2025

చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలి: కలెక్టర్

image

చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు హస్తకళలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. శనివారం రాత్రి రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపంలో జరిగిన హస్తకళా ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. హస్తకళలను ప్రోత్సహించడం మన సంస్కృతికి, కళాకారుల అభివృద్ధికి అవసరమని తెలిపారు. ఇటువంటి ప్రదర్శనలను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

News August 23, 2025

వినాయక ఉత్సవ కమిటీలకు కలెక్టర్ విజ్ఞప్తి

image

రాజమండ్రిలో వినాయక చవితి ఉత్సవాల అనుమతుల మంజూరు కోసం సింగిల్ విండో విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి తెలిపారు. ఉత్సవ కమిటీలు సులభంగా అనుమతులు పొందేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఈ ప్రక్రియలో నగరపాలక సంస్థకు సహకరించాలని ఆమె ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేశారు.