News October 8, 2025

పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన పెట్రోల్, డీజిల్: CP

image

పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కొణిజర్ల పోలీస్ స్టేషన్ ప్రక్కన ఏర్పాటు చేసిన HPCL పెట్రోల్ బంకును బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. పోలీస్ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ద్వారా నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించడమే కాకుండా దీనిపై వచ్చే ఆదాయం పోలీసు సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 8, 2025

మధిరలో కౌంటింగ్ సెంటర్ పర్యవేక్షించిన కలెక్టర్

image

మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల ఎంపీటీసీ–జడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రిక్రియేషన్ క్లబ్‌లో ప్రిసైడింగ్ అధికారుల శిక్షణలో పాల్గొని సూచనలు ఇచ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు.

News October 8, 2025

లింగ నిర్ధారణ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి: కలెక్టర్

image

గర్భస్థ లింగ నిర్ధారణ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన పీసీపీఎన్డిటి యాక్ట్ సమావేశంలో మాట్లాడారు. రిజిస్టర్ కాని స్కానింగ్ సెంటర్లను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి స్కానింగ్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ సునీల్ దత్, న్యాయ సేవాధికారి చంద్రశేఖరరావు పాల్గొన్నారు.

News October 8, 2025

KMM: నేడే కీలక తీర్పు.. జిల్లాలో ఉత్కంఠ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన కోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో ఖమ్మం జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 20 జడ్పీటీసీ, 20 ఎంపీపీ పదవుల భవితవ్యాన్ని, అలాగే 283 ఎంపీటీసీ స్థానాలు, 571 గ్రామ సర్పంచుల స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న