News February 28, 2025

పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలి: CP

image

ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులతో స్టేషన్ అధికారులు ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఫిర్యాదుపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని సీపీ అంబర్ కిషోర్ ఝూ ఆదేశించారు. ఇదే రీతిలో సీఐ, డివిజినల్ స్థాయి పోలీసులు సైతం పనిచేయడం ద్వారా ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెరగడంతో పాటు సమస్య పరిష్కారం అవుతుందని బాధితుడికి నమ్మకం కలుగుతుందని అధికారులకు తెలిపారు.

Similar News

News December 23, 2025

కులపిచ్చి ముందు ఓడిన కన్నప్రేమ

image

టెక్నాలజీ పరుగులు తీస్తున్నా సమాజాన్ని ఇంకా కులం అనే సంకెళ్లు వీడటం లేదు. కర్ణాటకలో పరువు హత్యే దీనికి నిదర్శనం. దళితుడిని ప్రేమపెళ్లి చేసుకుందని 6 నెలల గర్భిణి అయిన మాన్యను కన్నతండ్రే కర్కశంగా హతమార్చాడు. బంధువులతో కలిసి ఇనుప రాడ్డులతో దాడి చేసి పుట్టబోయే బిడ్డతో సహా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఈ ఘటన కొందరిలో కులపిచ్చి ఎంత బలంగా నాటుకుపోయిందో తెలియజేస్తోంది.

News December 23, 2025

పాపం ఆ తండ్రి.. గౌరవం కాపాడాల్సిన కొడుకే..!

image

UPలోని దేవరియాలో తండ్రిపైనే కేసు పెట్టాడో కొడుకు. తనను అందరి ముందు తిట్టి, కొట్టాడని PSకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. జరిగిన దాని గురించి వివరించేందుకు ఆ తండ్రి ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరికి అందరి ముందు మోకాళ్లపై కూర్చొని, క్షమించమని కొడుకును వేడుకున్నాడు. ఆ తర్వాతే అతడు ఇంటికి రావడానికి అంగీకరించాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి కొడుకు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

News December 23, 2025

నంద్యాల: ‘హాయ్’ అని పెడితే FIR కాపీ

image

వాట్సాప్‌లో 95523 00009కు ‘హాయ్’ అని పెడితే FIR కాపీ పంపించేలా చర్యలు చేపట్టామని నంద్యాల ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వాట్సాప్ గవర్నన్స్ తెచ్చిందన్నారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి FIR కాపీ కోసం గతంలో బాధితులు వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. ప్రభుత్వం ఇకపై వాట్సప్‌లోనే ఈ సౌకర్యం పొందే వెసులుబాటు కల్పించిందని వెల్లడించారు.