News September 24, 2024
పోలీస్ స్టేషన్‌లో చిత్తూరు జిల్లా వాసి ఆత్మహత్యాయత్నం

చిత్తూరు జిల్లా SRపురానికి చెందిన కుమార్ ఒంగోలు PSలో సోమవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అందిన సమాచారం..అప్పులు చేసి పరారై ఒంగోలు వచ్చి క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నాడు. అప్పులోళ్లు శనివారం ఒంగోలు వచ్చి టీడీపీ నేత సాయంతో ఘర్షణకు దిగారు. పోలీసులు అందరినీ స్టేషన్‌కు పిలిపించి సర్ది చెప్పారు. మళ్లీ వారు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు పిలిచి.. SI చేయిచేసుకున్నాడంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు.
Similar News
News March 3, 2026
చిత్తూరు పోలీసులకు 54 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 54 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 23 ఫిర్యాదులు ఉన్నాయి. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
News March 2, 2026
చిత్తూరు: పన్ను వసూళ్లకు 15 వరకు గడువు

చిత్తూరు జిల్లాలో పంచాయతీల్లో పన్నుల వసూళ్ల గడువును ఈనెల 15 వరకు ఇచ్చినట్లు డీపీవో సుధాకర్ రావు తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు జిల్లాలో 75 శాతం వసూళ్లు చేసినట్లు వెల్లడించారు. మొత్తం లక్ష్యం రూ.27.41 కోట్లు కాగా అందులో 75 శాతం అంటే రూ.20.55 కోట్లు రాబట్టామన్నారు. 15వ తేదీలోపు మిగిలిన 25 శాతం పన్నులను వసూలు చేయడానికి కృషి చేస్తామని వివరించారు.
News March 2, 2026
చిత్తూరు: టీచర్లకు గమనిక

టీచర్ల సీనియారిటీ జాబితాను టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టిస్) ఆధారంగా సిద్ధం చేసినట్లు చిత్తూరు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. డీఈవో, డీవైఈవో, ఎంఈవోల మెయిల్స్‌కు పంపించామని.. అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయ పనివేళల్లో తెలియజేయాలని సూచించారు. తగిన ఆధారాలతో సంబంధిత ఉప, మండల విద్యాశాఖాధికారులు ధ్రువీకరించిన పత్రాలను అందజేయాలన్నారు.


