News March 23, 2026
పోలీస్ PGRSకు ఫిర్యాదుల వెల్లువ

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని SP డి.నరసింహ కిషోర్ నిర్వహించారు. బాధితుల నుంచి 47 ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, చట్ట పరిధిలో త్వరితగతిన సమస్యలను పరిష్కరించి సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా SP స్పష్టం చేశారు.
Similar News
News April 20, 2026
కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 20, 2026
దళారుల ఉచ్చులో పడకండి: DTO

తూ.గో (D) రవాణాశాఖ సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నట్లు DTO ఆర్. సురేశ్ సోమవారం తెలిపారు. లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వినియోగదారులకు సూచించారు. సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎవరైనా లంచం అడిగితే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.