News April 10, 2026
పోషకాహార లోపాన్ని నివారించాలి: చిత్తూరు కలెక్టర్

చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో పోషణ్ పక్వాడ అవగాహన పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. అంగన్వాడీ ప్రీ స్కూల్ కిట్‌ను పరిశీలించారు. ఆరోగ్యవంతమైన సమాజానికి పోషకాహారం ఎంతో కీలకమని తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 14, 2026
చిత్తూరు జిల్లా ‘మండుతోంది’

చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం ఏడు మండలాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటాయి. అత్యధికంగా తవణంపల్లెలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరి, రొంపిచెర్లలో 40.7, శ్రీరంగరాజపురంలో 40.6, నిండ్రలో 40.5, గంగవరంలో 40.3, విజయపురంలో 40.0, పెద్దపంజాణిలో 39.6, బంగారుపాళ్యం, పులిచెర్ల మండలాల్లో 39.5 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది.
News April 14, 2026
చిత్తూరు జిల్లాలో నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు

చిత్తూరు జిల్లాలో మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా అగ్నిమాపక అధికారి పెద్దిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, అపార్టుమెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో అగ్నిప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. తద్వారా ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
News April 14, 2026
ప్రతి పీహెచ్సీకి ఇంటర్నెట్ సదుపాయం : కలెక్టర్

చిత్తూరు జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇంటర్నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ హామీ ఇచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గంలోని పీహెచ్సీ స్టాఫ్ నర్సులతో కలెక్టర్ సమీక్షించారు. అబా ఐడీ నమోదుకు ఆరోగ్య సిబ్బంది ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో రూ. 25 వేల తన సొంత నిధులతో ప్రత్యేక ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు.


