News April 10, 2025

పోషణ్ అభియాన్-2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జనగామ కలెక్టర్

image

ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేపట్టే పోషణ్ అభియాన్-2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మహిళ శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఐసీడీఎస్ పోషణ్ అభియాన్-పోషణ పక్షం 2025 కార్యక్రమంపై బుధవారం సమీక్ష నిర్వహించారు.

Similar News

News October 25, 2025

డిప్యూటీ ఈవోల బదిలీ తాత్కాలికంగా నిలుపుదలకు కారణం అదేనా?

image

TTDలో వివిధ విభాగాల్లోని డిప్యూటీ ఈవోల బదిలీలు ఈనెల 8న జరిగినా.. రెండురోజుల తర్వాత పై నుంచి ఆదేశాలు వచ్చే వరకు యథాస్థానంలోనే కొనసాగాలని వారికి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అయితే తాత్కాలికంగా వాయిదా చేయడానికి రాజకీయల ఒత్తిళ్లు కారణమా..? మరేమైనా కారణాలు ఉన్నాయా…? అని ఉద్యోగుల్లో చర్చ సాగుతోందట. త్వరలోనే పాలకమండలి సమావేశం అనంతరం మళ్ళీ బదిలీలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

News October 25, 2025

దూసుకొస్తున్న తుఫాను

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని APSDMA తెలిపింది. ఇది ప్రస్తుతానికి పోర్ట్‌బ్లెయిర్‌కి 420KM, విశాఖకు 990KM, చెన్నైకి 990KM, కాకినాడకు 1000KM దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి, ఎల్లుండికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 48 గంటల్లో రాష్ట్ర తీరం వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది.

News October 25, 2025

ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

image

TG: ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది.