News September 19, 2025

పోషణ మాసం ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించాలి: కలెక్టర్

image

పోషణ మాసం ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు.

Similar News

News September 20, 2025

బీఆర్ఎస్ నాయకులే నన్ను ఫేమస్ చేస్తున్నారు: చామల

image

బీఆర్ఎస్ నాయకులు నన్ను ట్రోల్ చేసి ప్రచారం కల్పించి ఫేమస్ చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తాను మాట్లాడిన మాటల్లోని కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని ప్రచారం చేస్తున్నారని, దీనికి భయపడి తాను సైలెంట్‌గా ఉంటానని బీఆర్ఎస్ నాయకులు భ్రమపడుతున్నారని పేర్కొన్నారు. తాను ఒక్కరోజు ప్రెస్‌మీట్ పెడితే బీఆర్ఎస్ సోషల్ మీడియా మూడు రోజులు ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు.

News September 20, 2025

ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇళ్లకు వంగమర్తి నుంచి ఇసుక

image

వంగమర్తి ఇసుక రీచ్ నుంచి పూడిక ద్వారా తీసిన 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అభివృద్ధి పనులకు వినియోగించాలని జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్ణయించింది. శుక్రవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

News September 19, 2025

NLG: వ్యవసాయాధికారిని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

నిడమనూరు మండల వ్యవసాయ అధికారి ముని కృష్ణయ్యను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. యూరియా కోసం రైతులు గురువారం నిడమనూరులో 2 గంటలకు పైగా కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో సమయంలో వ్యవసాయాధికారి స్థానికంగా అందుబాటులో లేడన్న విషయం తెలుసుకున్న కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.