News September 16, 2025

పోషణ మాసోత్సవాలకు ఎమ్మెల్యే కవ్వంపల్లికి రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం

image

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరిగే పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనాయణకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మేరకు, కరీంనగర్ జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి, మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆహ్వాన పత్రాన్ని మంగళవారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో ఎమ్మెల్యేకు అందజేశారు.

Similar News

News February 15, 2026

హుజురాబాద్ : నీళ్లు లేని ఫైర్ ఇంజన్… కళ్లముందే ఇల్లు బూడిద!

image

హుజూరాబాద్‌లోని మారుతినగర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో రిఫ్రిజిరేటర్ పేలి ఇల్లు దగ్ధమైంది. అద్దెకు ఉంటున్న దాసారపు మధునమ్మ ఇంట్లో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. గూన పెంకుల ఇల్లు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. హుజురాబాద్ ఫైర్ ఇంజన్‌లో ప్రారంభంలోనే నీరు లేకపోవడం విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి జమ్మికుంట ఫైర్ ఇంజన్ వచ్చి స్థానికుల సహాయం తో మంటలు అదుపులోకి తెచ్చినా భారీ ఆస్తి నష్టం జరిగింది.

News February 15, 2026

కరీంనగర్ మేయర్ పీఠం కమలం వశమే!

image

కరీంనగర్ నగరపాలక సంస్థలో కమల వికాసం ఖాయమైంది. బీజేపీ గెలిచిన 30 స్థానాలకు తోడు, ఇప్పటికే ఇద్దరు చేరగా.. తాజాగా శనివారం మరో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపీ బలం ఎక్స్-అఫీషియో ఓటుతో కలిపి 35కు చేరి, మ్యాజిక్ ఫిగర్ (34) దాటింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు తాజా చేరికలతో గండిపడింది.

News February 14, 2026

KNR: కాంగ్రెస్ నేతపై దాడి.. కేసు నమోదు

image

కరీంనగర్ రాజకీయ కక్షలతో కాంగ్రెస్ నాయకుడు శ్యాంసుందర్ రెడ్డిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కార్పొరేటర్ భూమయ్య భార్యకు మద్దతుగా ప్రచారం చేశారనే కోపంతో, మాజీ కార్పొరేటర్ సోదరుడు జంగిలి సతీశ్‌తో పాటు మరికొందరు ఆయనపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.