News April 6, 2024

పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలని జిల్లా డాక్టర్ సృజన అధికారులను కోరారు. సార్వత్రిక ఎన్నికలు -2024కు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే 33 నిత్యావసర సేవలు అందించే శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తోందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News February 20, 2026

కర్నూలు: రెండు వారాల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

image

కర్నూలు(D) గోనెగండ్ల మండలం ఐరన్ బండకు చెందిన టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ బోయ నీలకంఠ(30) నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ఇటీవలే నిశ్చితార్థం అయింది. మార్చి 5, 6వ తేదీలలో వివాహం జరగాల్సి ఉండగా ఈ ఘటనతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి. నీలకంఠ మృతి పట్ల టీడీపీ మండల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News February 20, 2026

నంద్యాల: గుండెపోటుతో కోవా బన్ను వ్యాపారి మృతి

image

నంద్యాల(D) ఆత్మకూరుకు చెందిన కోవా బన్ను వ్యాపారి షేక్ బాషా నిన్న గుండెపోటుతో మృతిచెందారు. మేడారం జాతర సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ చూపిన అత్యుత్సాహంతో అతని వ్యాపారం పడిపోయింది. ఈ వ్యాపారం కోసం ప్రత్యేకంగా గేదెలు, ఆటో కొనుగోలు చేయడంతో పాటు సుహానా-సమయ మిల్క్ డెయిరీ పేరుతో పాల ఉత్పత్తి చేసేవారు. వ్యాపారం ఆగిపోవడంతో అప్పులు తీర్చేమార్గం లేక వేదనకు గురై గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 19, 2026

కర్నూలు జిల్లా ప్రజల పక్షాన అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే

image

దేశంలోని ఎక్కువగా వలసలు వెళ్లే రైతు కూలీలున్న ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాల్లో మరిన్ని KGBVలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే పార్థసారథి కోరారు. వైసీపీ హయాంలో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో 25 సీజనల్ హాస్టళ్లుంటే.. వాటిని కేవలం 6 నెలల్లోనే 78కి పెంచామని చెప్పారు. అందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. ఇవి సరిపోవని, ఇంకా కావాలని కోరారు.