News December 6, 2025
పోస్టల్ బ్యాలెట్ వినియోగించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

మొదటి విడత ఎన్నికల సిబ్బంది ఈ నెల 6 నుంచొ 8వ తేదీ వరకు ఎంపీడీవో కార్యాలయాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. శనివారం రేగొండ, మొగుళ్లపల్లి, గణపురం, కొత్తపల్లి గోరి మండలాల్లోని రైతు వేదికల్లో జరిగే శిక్షణ కార్యక్రమానికి సిబ్బంది తప్పక హాజరు కావాలని ఆయన ఆదేశించారు.
Similar News
News December 6, 2025
నిర్మల్: పంచాయతీ ఎన్నికల్లో తాయిలాలు షురూ.!

నిర్మల్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఇప్పటికే సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు తమదైన రీతిలో తాయిలాలతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. క్వార్టర్ సీసాలు, డబ్బులు, విలువైన వస్తువులను ఇచ్చి ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓటును అమ్ముకోవద్దని పోలీసులు, మేధావులు సూచిస్తున్నప్పటికీ, కొంతమంది ఓటర్లు వాటిని పట్టించుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
News December 6, 2025
జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ.347 కోట్లు

అలంపూర్‌లో వెలసిన జోగులాంబ దేవి ఆలయ అభివృద్ధి కోసం రూ.347 కోట్లతో ప్రణాళికను రూపొందించారు. శుక్రవారం సచివాలయంలో ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తదితరులు ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ ప్రణాళికను వివరిస్తామని తెలిపారు. జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం సీఎంకు ఉందని వారు పేర్కొన్నారు.
News December 6, 2025
రెండో విడత ఎన్నికలు.. నేడు గుర్తులు కేటాయింపు.!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులకు ఆయా కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు ఈరోజు గుర్తులు కేటాయించనున్నారు. అటు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఇప్పటికే రెబల్స్ బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లను విత్ డ్రా చేయించే పనిలో నిమగమయ్యారు. కాగా గుర్తుల కేటాయింపు అనంతరం ఎన్నికల ప్రచారం ముమ్మరం కానుంది.


