News December 30, 2025

పోస్టల్ సర్వీసులు అద్భుతం.. నెటిజన్ సంతోషం

image

ఆధార్ అప్‌డేట్ విషయంలో పోస్టల్ సేవలపై ఓ నెటిజన్ ప్రశంసలు కురిపించారు. ఐదేళ్లు నిండిన తన బిడ్డ ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం 4 నెలలుగా స్లాట్ బుకింగ్‌కు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వెల్లడించారు. ఎక్కడ చూసినా స్లాట్లు లేవని.. చివరకు సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లగా కేవలం 30 నిమిషాల్లోనే పని పూర్తైందని ఆనందం వ్యక్తం చేశాడు. కొన్నిసార్లు తక్కువ అంచనా వేసిన వ్యవస్థలే ఉత్తమంగా పనిచేస్తాయన్నారు.

Similar News

News February 14, 2026

‘శివ లింగం’ అంటే ఏంటంటే?

image

పరమశివుని ఆరాధనలో ‘శివలింగం’ అత్యంత ముఖ్యమైనది. శాస్త్రాల ప్రకారం శివలింగం అంటే భగవంతుని ఒక రూపం లేదా ప్రతీక అని అర్థం. కంటికి కనిపించని ఆ పరమేశ్వరుడిని భక్తితో ఒక శిలా లేదా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి, స్థితి, లయకారుడైన ఆ దేవుని అనుగ్రహం పొందేందుకు ‘శివలింగారాధన’ ఒక గొప్ప మార్గం. ఈ ఆరాధన ద్వారా భక్తులు మానసిక ప్రశాంతతను, శివుడి అనుగ్రహాన్ని పొందుతారని పురోహితులు చెబుతున్నారు.

News February 14, 2026

పార్టీల విప్… ధిక్కరిస్తే ముప్పే

image

TG: పలు మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడ్డంతో ఛైర్మన్ ఎన్నికల్లో విప్ జారీకి పార్టీలు రెడీ అవుతున్నాయి. పార్లమెంటరీ రూల్ ప్రకారం విప్ 3 రకాలుగా ఉంది. 1లైన్ విప్‌ ఓటింగ్ సమాచారం ఇస్తుంది. సభ్యుడు సభకు గైర్హాజరు కావచ్చు. 2లైన్ల విప్‌ ఓటింగ్ సమాచారం+సభకు హాజరు కావడాన్ని చెబుతుంది. ఇక 3లైన్ల విప్‌ కీలకం. ఓటింగ్‌కు హాజరును తప్పనిసరి చేస్తూ పార్టీకే ఓటు వేయాలని ఆదేశిస్తుంది. ధిక్కరిస్తే అనర్హత వర్తిస్తుంది.

News February 14, 2026

NCPల విలీనం జరగదు: సంజయ్ రౌత్

image

మహారాష్ట్రలో దివంగత అజిత్ పవార్ NCP, శరద్ పవార్ NCPల <<19010034>>విలీనం<<>> లేనట్లేనని శివసేన(UBT) MP సంజయ్ రౌత్ వెల్లడించారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని పవార్ తనతో చెప్పారన్నారు. దీనిపై మహా వికాస్ అఘాడీలోని 3 పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. ఆయన 60 ఏళ్లుగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. కాగా ఛాతీ నొప్పితో ఇటీవల ఆస్పత్రిలో చేరిన పవార్ ఇవాళ డిశ్ఛార్జ్ అయ్యారు.