News June 1, 2024
పోస్ట్ పోల్ సర్వే.. ఉమ్మడి ప.గో.లో 2 ఎంపీ స్థానాలు కూటమివే
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 11 నుంచి 12 స్థానాల్లో, వైసీపీ 3- 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్‌పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని ఏలూరు పార్లమెంట్ స్థానంలో టీడీపీ, నరసాపురం నుంచి బీజేపీ గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ అంచనా వేసింది.
Similar News
News November 29, 2024
ఏలూరు: నవంబర్ 30న రూ.112.68 కోట్ల పంపిణీ
NTR భరోసా పెన్షన్ పంపిణీలను నవంబర్ 30న లబ్దిదారులకు 100 శాతం అందజేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 2,62,836 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.112.68 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. డిసెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగా అందిస్తున్నామన్నారు. పెన్షన్ పంపిణీలో పొరపాట్లు ఉండకూడదని హెచ్చరించారు.
News November 28, 2024

పగో జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కాలి: కలెక్టర్
ప.గో జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ మందిరంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విజన్-2047 డాక్యుమెంట్ రూపకల్పనతో జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కాలని అధికారులకు సూచించారు. జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిపై ఆరా తీశారు. రోడ్డు గుంతల పూడ్చివేత, పల్లె పండుగలో చేపట్టిన రోడ్డు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి కావాలన్నారు.