News August 24, 2025

పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జనగామ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని డీబీసీడీవో రవీందర్ తెలిపారు. అర్హత గల విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News August 24, 2025

MDK: మద్యం టెండర్లు.. వస్తే ఆ కిక్కే వేరు!

image

ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపారుల్లో కదలిక మొదలైంది. ప్రస్తుతం మద్యం షాపులు నడుపుతున్న యజమానులు, గతంలో టెండర్ వేసి షాపులు దొరకని వారు ఇప్పటి నుంచే గ్రూపులు, సిండికేట్లుగా ఏర్పడి టెండర్లలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. SDPT-93, MDK-49, SRD-101 కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 243 వైన్ షాపులు ఉన్నాయి. మద్యం పాలసీపై మీ కామెంట్.

News August 24, 2025

ఖమ్మం: ‘జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం’

image

ఆగస్టు 26 లోపు మైనారిటీ అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలోని TMR జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ ప్రాంతీయ సమన్వయ అధికారి అరుణ కుమారి తెలిపారు. ఎంపీసీ/బైపీసీ గ్రూపులలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియేట్ చదువుతున్న విద్యార్థులు TMR జూనియర్ కళాశాలలో ప్రవేశానికి అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు 91543 65017, 78931 16918 నెంబర్లకు సంప్రదించాలన్నారు.

News August 24, 2025

HYD: సంతాన సమస్యలు ఉన్నాయా? ఇక్కడకు వెళ్లండి

image

HYDలో సృష్టి ఘటనతో సంతాన సమస్యలు ఉన్న వారు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు చూస్తున్నారు. ఈ సమస్యలు ఉన్న వారికి వరప్రదాయానిగా ప్రభుత్వ ఆస్పత్రులు నిలుస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్, ప్లేట్ల బురుజు ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే కొండాపూర్ ఆస్పత్రిలోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
# SHARE IT