News October 31, 2025
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. క్యాబినెట్ హోదా కల్పిస్తూ అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఆయనకు క్యాబినెట్ హోదా గల ఛైర్మన్ పదవి లభించడం పట్ల నియోజకవర్గంలోని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News October 31, 2025
ఇంట్లో గోడ కూలి మహిళ మృతి.. మరొకరికి గాయాలు

ఇంట్లోని గోడ కూలి మహిళ మృతి చెందగా, మరో మహిళకు గాయాలైన ఘటన శుక్రవారం చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామం హరింద్రానగర్‌లో చోటుచేసుకుంది. కొట్లూరు శివమ్మ (52)ను గాయాలతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో మహిళ అత్త కొట్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News October 31, 2025
ఘనంగా అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్

హీరో అల్లు శిరీష్-నయనిక ఎంగేజ్‌మెంట్ ఇవాళ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. పెళ్లి తేదీపై త్వరలో ప్రకటన రానుంది.
News October 31, 2025
ఆ హక్కు బీఆర్ఎస్‌కు లేదు: రేవంత్

TG: బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ‘సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది బీఆర్ఎస్సే. గతంలో పీజేఆర్ చనిపోతే దుర్మార్గంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. ఇప్పుడు ఆ పార్టీకి సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదు’ అని మండిపడ్డారు. ఓట్లు అడిగేందుకు బీఆర్ఎస్ నేతలు వస్తే వాతలు పెట్టాలని అన్నారు.


