News December 24, 2025
ప్యాకెట్ పాలను మళ్లీ మరిగిస్తున్నారా? జరిగేది ఇదే

పాశ్చరైజ్డ్ పాలను 72-75 డిగ్రీల వద్ద 15-20సెకన్లు, UHT మిల్క్‌ను 135-150 డిగ్రీల వద్ద 2-5సెకన్లు కాచి చల్లార్చి ప్యాక్ చేస్తారు. దీంతో ప్రమాదకర బ్యాక్టీరియాలైన E.coli, సాల్మొనెల్లా, లిస్టీరియా నాశనమవుతాయి. ఈ ప్యాకెట్లు ఫ్రిజ్‌లో పెట్టకున్నా పాలు ఫ్రెష్‌గా ఉంటాయి. మళ్లీ మరిగిస్తే బీ1, 2, 6, 12, సీ విటమిన్లు 20-30% తగ్గుతాయి. లాక్టోజ్, ప్రొటీన్లు రియాక్టై రుచి మారి, క్రీమ్ లేయర్‌గా ఏర్పడుతుంది.
Similar News
News February 12, 2026
₹10లక్షలు చెల్లించాలి; ధోనీకి HC ఆదేశం.. కారణమిదే!

MS ధోనీ గతంలో వేసిన పరువు నష్టం దావా కేసును విచారించేందుకు వీడియోలను డాక్యుమెంట్లుగా మార్చేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.10లక్షలు చెల్లించాలని మద్రాస్ కోర్టు ఆదేశించింది. 2013 IPL ఫిక్సింగ్‌లో ధోనీ హస్తం ఉందని Ex IPS జి.సంపత్ కుమార్, మరికొందరు ఆరోపణలు చేశారు. దీంతో ₹100 కోట్లకు ధోనీ పరువునష్టం దావా వేశారు. 2025 ఆగస్టులో కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘మహాదేవ’’

ముక్కోటి దేవతలలో శివుడి స్థానం అత్యున్నతమైనది. సృష్టి, స్థితి, లయ కారకులలో ఆయన లయకారుడైనప్పటికీ, జ్ఞానానికి ఆయనే మూలం. దేవతలకు, అసురులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు, సృష్టికి ప్రమాదం వాటిల్లినప్పుడు దేవతలందరూ శివుడినే శరణు కోరుతారు. బ్రహ్మ, విష్ణువుల వంటి వారికే ఆదిగురువుగా నిలిచిన దేవుడు శివుడు. దేవతలకు సైతం దేవుడు కాబట్టి ఆయనను ‘మహాదేవుడు’ అని పిలుస్తారు. అంటే దేవుళ్లందరిలో గొప్పవాడు అని అర్థం.
News February 12, 2026
చామగడ్డ విత్తన దుంపలను ఎలా నిల్వ చేయాలి?

పక్వానికి వచ్చిన చామగడ్డ పంటను తవ్వి కాస్త ఆరబెట్టి మార్కెట్ చేసుకోవాలి. విత్తన దుంపలను తవ్విన తర్వాత వాటికి కనీసం నెల రోజుల నిద్రావస్థ ఉంటుంది. ఆ సమయంలో అవి కుళ్లిపోకుండా తవ్విన 4-5 రోజుల తరువాత, దుంపలపై 10 లీటర్ల నీటిలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములను కలిపి దుంపలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దుంపలను గాలి, వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలంటున్నారు నిపుణులు.


