News January 21, 2026

ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

image

పీరియడ్స్‌లో అమ్మాయిలు చాలా అసౌకర్యానికి గురవుతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకోసారి ప్యాడ్ మార్చాలి. మైల్డ్ సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.

Similar News

News February 10, 2026

USతో జరిగింది ‘ట్రాప్ డీల్’: ఖర్గే

image

USతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని మల్లికార్జున ఖర్గే ‘ట్రాప్ డీల్’గా అభివర్ణించారు. రష్యా నుంచి చమురు నిలిపివేయాలన్న షరతుకు ఒప్పుకోవడం భారత్ తన సార్వభౌమాధికారాన్ని కోల్పోవడమేనని ఆరోపించారు. Genetically Modified ఫీడ్, పప్పు ధాన్యాల దిగుమతులకు అంగీకరించడం రైతులకు జరిగే తీరని అన్యాయమని పేర్కొన్నారు. దుస్తుల ఎగుమతుల్లోనూ భారత్ కంటే బంగ్లాకే ఎక్కువ ప్రయోజనం చేకూరేలా ఈ ఒప్పందం ఉందని మండిపడ్డారు.

News February 10, 2026

జాతకం ఎలా లెక్కిస్తారు?

image

వ్యక్తి జన్మించిన సమయం, ప్రదేశం, రాశి చక్రం ఆధారంగా గ్రహాల స్థితులను లెక్కించే శాస్త్రమే జ్యోతిషం. ఆకాశాన్ని 12 రాశులుగా విభజించి, వ్యక్తి పుట్టినప్పుడు ఏ గ్రహం ఏ రాశిలో ఉందో గమనించి జన్మ కుండలిని రూపొందిస్తారు. గ్రహాల గమనం, నక్షత్ర పాదాలను బట్టి భవిష్యత్తు అంచనా వేస్తారు. గ్రహ కోణాలు లెక్కించి, వాటి ప్రభావం మానవ జీవితంపై ఎలా ఉంటుందో వివరిస్తారు. ఖగోళ గణితం, ఆధ్యాత్మిక విశ్లేషణల కలయిక జ్యోతిష్యం.

News February 10, 2026

బత్తాయి తోటల్లో కలుపు నివారణ ఎలా?

image

బత్తాయి తోటల్లో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. దీని నివారణకు భూమిని బాగా దుక్కి చేసిన తర్వాత హెక్టారు భూమికి 250 లీటర్ల నీటిలో ఆక్సీప్లోరోఫిన్ 300 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. చెట్ల పొదలు, చెట్ల వరుసల మధ్య దీన్ని పిచికారీ చేయాలి. ఒక నెల తర్వాత రెండో సారి కూడా ఇదే మోతాదులో పిచికారీ చేస్తే బత్తాయి తోటల్లో కలుపును సమర్థవంతంగా నివారించవచ్చని ఉద్యాన శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.