News September 23, 2025
ప్యానల్ స్పీకర్లుగా ప్రొద్దుటూరు, బద్వేల్ MLAలు

కడప జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు గౌరవ హోదా లభించింది. ప్రొద్దుటూరు, బద్వేల్ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజుల రెడ్డి, దాసరి సుధను అసెంబ్లీ ప్యానల్ స్పీకర్లుగా నియమించారు. ఈ మేరకు నిన్న అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘరామ కృష్ణరాజు ఈ మేరకు ప్రకటన చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు అందుబాటులో లేనప్పుడు వీళ్లు స్పీకర్ స్థానంలో ఉండి అసెంబ్లీని నడిపిస్తారు.
Similar News
News September 28, 2025
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయర్స్‌తో ఎస్పీ నచికేత్ సమావేశం

కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శనివారం 50 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయర్స్‌తో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇన్‌ఫ్లూయర్స్ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రీల్స్, పోస్టులు, కథనాలు సమాజ హితానికి ఉపయోగపడేలా రూపొందించాలి, హింస, కుల, మత వివేధాలను కలిగించే పోస్టులలు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News September 27, 2025

వెస్ట్ జోన్ ప్రీ-రిపబ్లిక్ డే క్యాంప్‌నకు ఎంపికైన వైవీయూ వాలంటీర్లు

వైవీయూ NSS వాలంటీర్లు విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రతిభ చూపి వెస్ట్ జోన్ ప్రీ-రిపబ్లిక్ డే క్యాంప్‌నకు ఎంపికయ్యారు. ఎంపికైన వారి వివరాలు..
బి.ఈశ్వర్ (YVU)
బి. నవీన్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైదుకూరు)
పి.నీలమహేశ్వరి (జీడీసీ, కడప)
వీరు అక్టోబర్‌లో గుజరాత్‌లో జరిగే శిబిరానికి హాజరవుతారు. వీరిని కో ఆర్డినేటర్ ఎన్.వెంకటరామిరెడ్డి, VC శ్రీనివాసరావు, రిజిస్ట్రారు పద్మ, ప్రొ. శ్రీనివాస్ అభినందించారు.