News January 14, 2026
ప్యాసింజర్ వెహికల్స్‌కు పెరుగుతున్న డిమాండ్

కార్లు, ఆటోలు వంటి ప్యాసింజర్ వెహికల్స్‌కు ఏటా డిమాండ్ పెరుగుతోంది. గతంతో పోలిస్తే 2025 DECలో కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా అయిన వాహనాలు 27% పెరిగాయని SIAM పేర్కొంది. ‘ప్యాసింజర్ వెహికల్స్ గతనెలలో 3,99,216 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 DECతో పోలిస్తే 26.8% ఇవి అధికం. టూవీలర్స్ డిస్పాచ్ కూడా 39% పెరిగింది. 2025 DECలో ఇవి 15,41,036 యూనిట్లు సరఫరా కాగా 2024 ఇదే నెలలో 11,05,565 వెళ్లాయి’ అని తెలిపింది.
Similar News
News February 5, 2026
మల్లె సాగు – అనువైన రకాలు

మల్లె సాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలల్లో దిగుబడి బాగుంటుంది. గుండు మల్లె, జాజిమల్లె, కాగడా మల్లె రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గుండు మల్లెల్లో అర్క ఆరాధన, కో-2, కస్తూరి రకాలు.. జాజిమల్లెల్లో అర్క సురభి, కో-1, కో-2 రకాలు మంచి దిగుబడినిస్తాయి. పూల కోసం, నూనె తయారీకి జాజిమల్లెలు అనుకూలం. కాగడ మల్లెలు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకుంటాయి.
News February 5, 2026
కానుగ నీడ, కన్నతల్లి నీడ

ప్రకృతిలో లభించే నీడలలో కానుగ చెట్టు నీడ అత్యంత చల్లనిదిగా పరిగణించబడుతుంది. ఇతర చెట్ల కంటే దీని ఆకులు దట్టంగా ఉండి, ఎండను అసలు చొరబడనీయకుండా ఉంటాయి. అందుకే ఈ చెట్టు కింద సేద తీరితే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక బిడ్డకు తన కన్నతల్లి ఒడి ఎంతటి భద్రతను, చల్లదనాన్ని, ఓదార్పును ఇస్తుందో.. ఎండలో అలసిపోయిన బాటసారికి కానుగ చెట్టు నీడ అంతటి ఉపశమనాన్ని ఇస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.
News February 5, 2026
WPL-2026: ఫైనల్ క్వీన్ ఎవరో?

WPL-2026లో ఇవాళ ఢిల్లీ, బెంగళూరు మధ్య వడోదర వేదికగా ఫైనల్ జరగనుంది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ తొలి టైటిల్‌పై కన్నేసింది. ఈ సీజన్‌లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న RCB రెండో సారి ట్రోఫీ నెగ్గాలని చూస్తోంది. ఇరు జట్లు 9 సార్లు తలపడగా ఆరు విజయాలతో ఢిల్లీదే పైచేయిగా ఉంది. అయినా 2024 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓడటం DCని కలవరపరుస్తోంది.
మ్యాచ్: 7.30pm, లైవ్: జియో హాట్‌స్టార్, Star Sports.


