News September 27, 2025

ప్రకాశంలో పర్యాటక అందాలు ఎన్నో ఎన్నెన్నో..!

image

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. ప్రకాశం జిల్లాలో పర్యాటక ప్రదేశాల జాబితా కోకొల్లలు. ఇటు ఆధ్యాత్మిక, అటు ప్రకృతి హొయలు గల పర్యాటక ప్రదేశాలు జిల్లాలో ఉన్నాయి. భైరవకోన, త్రిపురాంతకేశ్వర ఆలయం, రాచర్ల నెమలిగుండ్ల రంగనాయకస్వామి, మాలకొండ, సింగరాయకొండ నరసింహస్వామి క్షేత్రం వంటి ఆలయాలు ఉన్నాయి. కొత్తపట్నం, పాకల బీచ్‌లు, మైలవరం డ్యాం, నల్లమల అడవుల అందాలు ఎన్నో. మరి ఈ దసరాకు మీరు ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు.

Similar News

News September 27, 2025

ప్రకాశం: ‘ఒకరికి ఒక్క ఓటే ఉండాలి’

image

ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఓటరు ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలని DRO చిన్న ఓబులేసు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గల డిఆర్వో ఛాంబర్‌లో శుక్రవారం గుర్తింపు పొందిన పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ.. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోనివారు, వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 18ఏళ్ళు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

News September 27, 2025

ప్రకాశం: ‘పన్నుల తగ్గింపుపై ప్రచారం చేయాలి’

image

వస్తు సేవా పన్నులను ప్రభుత్వం తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు శుక్రవారం తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, MROలు, ఎంపీడీవోలతో శుక్రవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వస్తు సేవల పన్ను తగ్గింపుపై విస్తృతమైన ప్రచారం చేయాలన్నారు. అలాగే ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

News September 27, 2025

జీఎస్టీపై విస్తృత ప్రచారం చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు స్పష్టంగా వివరించాలని చీఫ్ సెక్రటరీ విజయానంద్ తెలిపారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్, పీఎం కుసుమ్, అన్న క్యాంటీన్లు, చెత్త సేకరణలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాజధాని అమరావతి నుంచి శుక్రవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ రాజబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అంశాలపై మాట్లాడారు.