News January 28, 2026
ప్రకాశంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

జిల్లాలో వినూత్నమైన కార్యక్రమానికి కలెక్టర్ రాజాబాబు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని హాస్టల్, పాఠశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపేలా వన్ ఆఫీసర్ – వన్ ఇన్స్టిట్యూట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంగళవారం కలెక్టర్ పిలుపునిచ్చారు. దీనితో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు పడేలా కార్యక్రమం దోహదపడుతుందన్నారు. అలాగే 10th విద్యార్థులను వందరోజుల ప్రణాళికతో చదివించాలన్నారు.
Similar News
News February 19, 2026
ప్రకాశం: నేటి నుంచి రంజాన్.. ఉపవాస వేళలు

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభంకానుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేటి ఉపవాస వేళలు ఇలా ఉన్నాయి.
☞ ఒంగోలులో ….
★ సహర్: ఉ.5-5.21
★ ఇఫ్తార్: సా.6.29
★ ఉపవాస కాలం: మొదటి రోజు సుమారు 13 గంటల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.
☞ నోట్: ప్రాంతాలను బట్టి వేళలు కొన్నినిమిషాలు మారొచ్చు.
News February 18, 2026
మార్కాపురం జిల్లా మెడికల్ విద్యార్థిని సూసైడ్

మార్కాపురం జిల్లాలో మెడికల్ విద్యార్థిని సూసైడ్ తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నూలు (D) గూడూరు(M) పెంచికలపాడులోని విశ్వభారతి మెడికల్ కాలేజీ సోనిక(22) సూసైడ్ చేసుకుంది. తర్లుపాడుకు చెందిన సోనిక పారామెడికల్ అనస్థీషియా ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండి మంగళవారం హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం SI అఖిల్ కేసు నమోదు చేశారు.
News February 18, 2026
ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ప్రకాశం భవన్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యం, స్వామిత్వ సర్వేపై సమీక్షించారు. APMAY 2.0 పథకంతో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.


