News May 10, 2024
ప్రకాశం: అకాల వర్షానికి 152 ఎకరాల అరటి నష్టం

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈనెల 7న కురిసిన అకాల వర్షానికి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి వై గోపీచంద్ తెలిపారు. ఉద్యాన పంటలు అరటి 152 ఎకరాలు, బొప్పాయి 45 ఎకరాలు, కొంత మొక్కజొన్న పంట వర్షంతో పాటు వీచిన గాలులకు నేలకొరిగి దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి చెప్పారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 18, 2025
పొన్నలూరు: బాకీ డబ్బుల కోసం మహిళ నిరసన.!

పొన్నలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ మధురైకి చెందిన మహిళ గురువారం అతని ఇంటి ఎదురుగా నిరసనకు దిగింది. తమ నుంచి రూ.68 లక్షలు తీసుకొని, చెల్లించాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడం లేదంటూ మధురై నుంచి వచ్చి నిరసన తెలిపింది. సదరు వ్యక్తి లేకపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అనూక్ మాట్లాడి నిరసన విరమింపజేశారు.
News December 18, 2025
చంద్రన్న మార్కాపురం జిల్లా.. ఫ్లెక్సీ వైరల్.!

ప్రకాశం నుంచి విడిపోతున్న మార్కాపురం జిల్లా పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. MLA కందుల నారాయణరెడ్డి జిల్లా ప్రకటన తర్వాత చంద్రన్న మార్కాపురం జిల్లాగా నామకరణం చేయాలన్నారు. దీనిని పలు సంఘాలు వ్యతిరేకించి, నల్లమల జిల్లా, కాటమరాజు జిల్లా పేర్లను ప్రతిపాదించాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుతం ఓ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చంద్రన్న మార్కాపురం జిల్లా అంటూ ఫ్లెక్సీలో ఉండడం గమనార్హం.
News December 18, 2025
టంగుటూరు మర్డర్.. మృతుని వివరాలివే.!

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ హత్య జరిగిన విషయం తెలిసిందే. మృతుడు మర్రిపూడి మండలం కూచిపూడికి చెందిన వెంకటరమణయ్యగా పోలీసులు గుర్తించారు. రమణయ్య టంగుటూరు ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య చనిపోగా కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సిఉంది.


