News March 22, 2024
ప్రకాశం: అన్నదమ్ముల దారెటు

ప్రకాశం జిల్లాలో ఆమంచి అన్నదమ్ములు సైలెంట్ ఆసక్తి రేపుతోంది. కృష్ణమోహన్ చీరాల ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. 2019లో కరణం బలరాం చేతిలో ఓడిపోవడంతో ఆయన్ను పర్చూరు ఇన్‌ఛార్జ్‌గా వైసీపీ నియమించింది. తాజాగా పర్చూరు టికెట్ యడం బాలాజీకి కేటాయించింది. మరోవైపు ఆమంచి స్వాములు జనసేన నుంచి గిద్దలూరు టికెట్ ఆశించినా దక్కలేదు. సీటు రాని ఆమంచి సోదరులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.
Similar News
News April 20, 2025
ప్రకాశం: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో 24 రోజులు పెళ్లిళ్లకు మంచి గడియలు ఉన్నాయి. మండు వేసవి అయినప్పటికీ మంచిగడియల్లో పెళ్లిళ్లు చేయాలని పెద్దలు నిర్ణయించడంతో ప్రకాశం జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సీజన్‌లో కేవలం వివాహాల మీదనే రూ.30 కోట్ల వ్యాపారాలు జరుగుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక కళ్యాణ మండపాలు, గోల్డ్, బట్టల షాపులు సందడిగా మారాయి.
News April 20, 2025
DSC: ప్రకాశం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

డీఎస్సీ-2025 ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 629 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్-1:39
➤ హిందీ:23 ➤ ఇంగ్లిష్: 95
➤ గణితం: 94 ➤ఫిజిక్స్: 76
➤ జీవశాస్త్రం: 63 ➤ సోషల్: 106
➤ పీఈటీ: 72 ➤ ఎస్జీటీ:106
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో తెలుగు 2, హిందీ 4, ఆంగ్లం 4, గణితం 1, ఫిజిక్స్ 2, బయాలజీ 2, సోషల్ 2, ఎస్టీటీ 26 భర్తీ చేస్తారు.
News April 20, 2025
ఒంగోలు: ‘జిల్లా అభివృద్ధి చెందేలా చర్యలు వేగవంతం చేయాలి’

వనరులను సద్వినియోగం చేసుకుని జిల్లా అన్ని విధాలా అభివృద్ది చెందేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జిల్లాకు తనను ప్రత్యేక అధికారిగా నియమించిందని తెలిపారు.