News January 3, 2025
ప్రకాశం: అరుదైన మొక్కల స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్
పక్కాగా అందిన సమాచారంతో అరుదుగా కనిపించే మొక్కలను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఒంగోలులో గురువారం చోటుచేసుకుంది. నిందితుల నుంచి 9.8 కిలోల ఇంద్రజాల, 0.286 కిలోల మహేంద్రజాల మొక్కలు, 6 శంఖాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులో ఉన్న నిందితుల సమాచారం మేరకు మొక్కలు సరఫరా చేసిన వ్యక్తిని ఒంగోలులో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 6.64 కిలోల మొక్కలను స్వాధీనం చేసుకున్నారు
Similar News
News January 5, 2025
ఒంగోలు: సోమవారం మీకోసం కార్యక్రమం రద్దు
ఒంగోలులోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీవ్ రంజన్ మిశ్రా వన్ మ్యాన్ కమిషన్ పర్యటన జిల్లాలో ఉన్నందున, సోమవారం పీజిఆర్ఎప్ హాలులో దళితుల నుంచి అర్జీలు సేకరించే కార్యక్రమం ఉన్న నేపథ్యంలో రద్దు చేసినట్లు తెలిపారు. దూరప్రాంతాల ప్రజలు ఎవరూ ఒంగోలు రావద్దని ఆమె కోరారు.
News January 4, 2025
పల్లె పండుగ రోడ్లను త్వరగా పూర్తి చేయండి: ప్రకాశం కలెక్టర్
పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. పనుల పురోగతిపై శనివారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. చేసిన పనులకు బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లిస్తున్నందున పనులను వేగవంతం చేసి బిల్లులను అప్లోడ్ చేయాలని చెప్పారు. జిల్లాకు కేటాయించిన పనులు, వాటి పురోగతిపై నియోజకవర్గాల వారీగా ఆమె ఆరా తీశారు.
News January 4, 2025
ప్రకాశం జిల్లాలో ఎయిర్‌పోర్టుపై CM కీలక ప్రకటన
ప్రకాశం జిల్లా దొనకొండలో బ్రిటీష్ కాలంలోనే ఎయిర్ ఫోర్ట్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇది ఎప్పుడో మూతపడింది. ఈ నేపథ్యంలో ఒంగోలుకు దగ్గరలోని కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆ ఏరియాలో 723 ఎకరాలను గుర్తించినట్లు సీఎం చంద్రబాబు నిన్నటి సమీక్షలో వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.