News February 25, 2025
ప్రకాశం: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష

2025-26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో చేరటానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా డీఈఓ కిరణ్ సోమవారం తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి, 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో చేరటానికి ఆసక్తి కనబరిచే విద్యార్థులు ఆన్లైన్‌లో మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News February 25, 2025
పి-4 సర్వేను వేగవంతం చేయండి: ప్రకాశం కలెక్టర్

పి-4 సర్వేను వేగవంతం చేయాలని కలెక్టరు తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం మండల స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై ఆమె వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి ఒకటో తేదీన పెన్షన్‌ల పంపిణీ ఉంటుందని, రెండో తేదీ ఆదివారం అయినందున ఈ సర్వేను ఈవారం లోనే పూర్తి చేయాలని స్పష్టం చేసారు. క్షేత్ర స్థాయిలో సచివాలయ సిబ్బంది మరింత చురుకుగా పని చేయాలని ఆమె కోరారు.
News February 25, 2025
YS జగన్‌పై మంత్రి స్వామి హాట్ కామెంట్స్

30 ఏళ్లు అధికారం నాదేనంటూ విర్రవీగిన జగన్‌ని ప్రజలు ఐదేళ్లకే భరించలేక ఛీత్కరించినా.. మళ్ళీ మరో 30 ఏళ్లు అధికారం తమదేనని జగన్ కార్యకర్తలను మభ్యపెడుతున్నాడని మంత్రి స్వామి అన్నారు. సోమవారం అసెంబ్లీలో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేకపోయాడని ఎద్దేవా చేశారు. జగన్‌కి పదవులు మీద ఉన్న ఆరాటం ప్రజాసమస్యలపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే తనపదవి రద్దవుతుందని వచ్చారన్నారు.
News February 24, 2025
గవర్నర్‌కు ఎర్రగొండపాలెం MLA కౌంటర్

ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబు పేరును తప్పుగా ఉచ్చరించారు. దీనిపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ‘నరేంద్ర పవన్ చంద్రబాబు నాయుడు అని చదివితే బాగుండేది. కూటమి ధర్మం కూడా నిలబడేది’ అంటూ Xలో పోస్ట్ చేశారు.