News September 18, 2024

ప్రకాశం: ఆర్టీసీలో దరఖాస్తులకు ఆహ్వానం

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు ఆసక్తి గల ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒంగోలు ప్రజా రవాణా అధికారి బి.సుధాకర్‌రావు తెలిపారు. <>www.apprenticeshipindia.gov.in<<>> వెబ్‌సైట్ ద్వారా అక్టోబర్ 3వ తేదీలోపు అప్లై చేసుకోవాలని సూచించారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కలిపి 298 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు.

Similar News

News September 18, 2025

ప్రకాశం ఎస్పీ గారూ.. ప్లీజ్ ఈవ్ టీజింగ్‌పై లుక్కేయండి!

image

ప్రకాశం జిల్లా నూతన SP హర్షవర్ధన్ రాజు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో SPగా ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్‌పై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు ప్రకాశంలో కూడా అదే తీరు చూపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. స్కూల్స్, కళాశాలలు మొదలు, ముగిసే సమయాల్లో పోకిరీల ఆగడాలు పెరిగాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. SP చొరవ తీసుకోవాలని వారు కోరారు.

News September 18, 2025

ఇవాళ ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

image

ప్రకాశం జిల్లాకు గురువారం సైతం మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటించింది. కాగా బుధవారం ప్రకాశం జిల్లాలోని పలు మండలాలలో జోరు వానలు కురిసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఒంగోలులో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గురువారం కూడా వర్ష సూచన ఉండడంతో, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News September 17, 2025

ప్రకాశం: ఐటీఐ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్

image

జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు జిల్లా ఐటీఐ కన్వీనర్ ప్రసాద్ బాబు శుభవార్త చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు. జిల్లాలో మొత్తం 54 ఖాళీలు ఉన్నాయన్నారు.