News November 10, 2024
ప్రకాశం: ‘ఆ SI శ్రమకి ఫలితం దక్కలేదు’
ప్రకాశం జిల్లా ఉలవపాడు SI అంకమ్మ శనివారం ప్రాణాలకు తెగించి ఓ సాహసం చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉలవపాడులోని వేణుగోపాలస్వామి ఆలయ కోనేరులో మతిస్థిమితంలేని యువకుడు శనివారం కాలుజారి పడ్డాడు. విషయం తెలుసుకున్న SI అక్కడికి చేరుకున్నారు. తర్వాత తానే స్వయంగా కోనేరులో దూకి యువకున్ని కాపాడే ప్రయత్నం చేయగా దురదృష్టవశాత్తు అతడు అప్పటికే మృతి చెందాడు.
Similar News
News November 13, 2024
ప్రకాశం కలెక్టర్‌తో భేటీ అయిన దామచర్ల సత్య
ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో ఉన్న కలెక్టరేట్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియాను మంగళవారం సాయంత్రం రాష్ట్ర మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య కలిసి పలు ప్రజా సమస్యలపై చర్చించారు. కొండపి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సత్య కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు సత్య అందజేశారు.
News November 12, 2024
ప్రకాశం: ఒకేరోజు ముగ్గురు పోలీసుల మృతి
ప్రకాశం జిల్లాలో సోమవారం విషాద ఘటనలు జరిగాయి. గతంలో నారా భువనేశ్వరికి సపోర్టుగా నిలిచిన హెడ్ కానిస్టేబుల్ <<14584058>>విజయకృష్ణ<<>> గుండెపోటుతో కన్నుమూశారు. మార్కాపురం(M) కొట్టాపల్లికి చెందిన కానిస్టేబుల్ <<14580513>>వేముల మస్తాన్<<>> భార్యతో గొడవపడి ఉరేసుకున్నారు. ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చలపతిరావు అనారోగ్యానికి గురయ్యారు. HYDకు తరలిస్తుండగా మేదరమెట్ల వద్ద గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
News November 12, 2024
ప్రకాశం జిల్లా ప్రాజెక్టులకు రూ.444.15 కోట్లు
అసెంబ్లీలో నిన్న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.394 కోట్లు కేటాయించారు. అలాగే గుండ్లకమ్మకు సైతం రూ.13 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. మొత్తం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు కలిపి ఎన్డీఏ ప్రభుత్వం రూ.444.15 కోట్లు కేటాయించిందని.. గత ప్రభుత్వం రూ.168.92 కోట్లనే బడ్జెట్‌లో ప్రతిపాదించిందని కూటమి నేతలు అన్నారు.