News April 8, 2024

ప్రకాశం: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

కొరిసపాడు మండలం పమిడిపాడులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకున్నట్లు పోలీసుల తెలిపారు. అత్తింటి చిన్న అంజయ్య(50) పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Similar News

News October 4, 2025

ప్రకాశం: ఆధార్ అప్డేట్ చేయాలా.. ఈ ఛాన్స్ మీకోసమే.!

image

ప్రకాశం జిల్లాలో ఈనెల ఆరో తేదీ నుంచి పదవతేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ సూపరిటెండెంట్ మహమ్మద్ జాఫర్ సాదిక్ తెలిపారు. ఒంగోలులో శుక్రవారం స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. తపాలశాఖ ద్వారా ఆధార్ నమోదు ప్రక్రియను సాధించేందుకు ఈనెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News October 3, 2025

జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ప్రకాశం SP

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయాన్ని శుక్రవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా సందర్శించి, పలు విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలోని పూర్తి విభాగాలను రికార్డులను ఎస్పీ తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రికార్డులు పెండింగ్ లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు వాటిని అప్డేట్ చేయాలని సూచించారు. సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలన్నారు.

News October 3, 2025

కనిగిరి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 3 నెలలపాటు నిరుద్యోగ యువతీ, యువకులకు అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని 17- 45 ఏళ్లవారు వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ ఉషారాణి తెలిపారు. సాఫ్ట్వేర్ డెవలపింగ్‌లో రూ.లక్ష వరకు జీతాలు ఉంటాయన్నారు. వివరాలకు 8008822821 నంబర్‌ను సంప్రదించాలన్నారు.