News August 27, 2025

ప్రకాశం ఎస్పీ కార్యాలయంలో వినాయక చవితి పూజలు.!

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ప్రసాదాన్ని ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News August 27, 2025

ప్రకాశం: రేపే DSC వెరిఫికేషన్.. ఇవి తప్పనిసరి.!

image

మెగా DSC-2025 మెరిట్ జాబితా అభ్యర్థులకు DEO కిరణ్ కుమార్ బుధవారం సూచనలు చేశారు.
➤మెరిట్ జాబితా AP-DSC వెబ్‌సైట్‌లో చూసుకోవాలి.
➤రేపటి నుంచి ఒంగోలు సరస్వతి జూనియర్ కాలేజీలో వెరిఫికేషన్.
➤అభ్యర్థులు లాగిన్ ఐడీతో కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలి.
➤5 ఫొటోలు, 3సెట్ల జిరాక్సులు, ఒరిజినల్ పత్రాలు తేవాలి.
➤సూచించిన తేదీలో హాజరు కాకుంటే అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.
NOTE: సందేహాలుంటే కామెంట్‌లో తెలపండి.

News August 27, 2025

డ్రోన్ కెమెరా పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ

image

డ్రోన్ కెమెరాలతో శాంతిభద్రతల పరిరక్షణ ఆధునిక పద్ధతులతో సాగుతుందని ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మార్కాపురం మండలం కోల భీమినిపాడుకు చెందిన పోలిరెడ్డి డ్రోన్ కెమెరాను జిల్లా ఎస్పీకి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆ డ్రోన్ కెమెరాను మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఎస్పీ అందజేశారు. వెలిగండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు తప్పిపోయిన ఘటనలో డ్రోన్ కెమెరా ఉపయోగపడిందన్నారు.

News August 26, 2025

ప్రకాశం: బార్ల దరఖాస్తుల గడువు పెంపు.!

image

ప్రకాశం జిల్లాకు ఓపెన్ కేటగిరిలో కేటాయించబడ్డ 26 బార్ల దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి అయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ముందుగా 28వ తేదీ గడువు ఉండగా, ప్రభుత్వం 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ బార్లకు 30వ తేదీ ఉదయం 8 గంటలకు లాటరీ తీస్తామన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తులను సమర్పించాలని కోరారు.