News August 2, 2024

ప్రకాశం ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

image

ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ రాజకీయ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ కారణాలతో ఘర్షణలకు పాల్పడితే రౌడీషీట్లు తెరుస్తామన్నారు. మహిళలు, చిన్నారులు, విద్యార్థునులను ఎవరైనా వేధిస్తే కటకటాల ఊసలు లెక్కిస్తారని హెచ్చరించారు. జిల్లాలో భూకబ్జాలకు పాల్పడితే పోలీస్ పవర్ ఏంటో చూపిస్తామన్నారు. ఇప్పటికే నేరాలు చేసి బెయిల్‌పై కాని, విడుదలైన వారిపై పోలీసుల నిఘా ఉంటుందని సూచించారు.

Similar News

News February 6, 2026

సంతనూతలపాడు వద్ద గంటలు తరబడి ట్రాఫిక్

image

సంతనూతలపాడులో ఎండ్లూరు డొంక వద్ద రహదారిపై ఉన్న కల్వర్టు కూలిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా సంతనూతలపాడు నుంచి ఒంగోలు వెళ్లే రహదారిలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. చెన్నై నుంచి భారీ వాహనం భారీ లోడుతో కల్వర్టుపైకి రాగానే ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

News February 6, 2026

ఉమ్మడి ప్రకాశం: 10th పరీక్షల ఫీజు గడువు పెంపు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్చిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. వీటికి హాజరయ్యే రెగ్యులర్/ ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థుల కోసం తత్కాల్ పరీక్ష ఫీజు ఆలస్య రుసుముతో చెల్లించడానికి గడువు పొడిగించినట్లు ప్రకాశం జిల్లా DEO రేణుక చెప్పారు. రూ.1,000 ఫైన్‌తో ఈనెల 12వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. ఈ సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం గమనించాలని సూచించారు.

News February 6, 2026

ప్రకాశం జిల్లాలో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే

image

ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్నబోయినపల్లి, చాగళ్లు, దూబగుంట, జె.పంగలూరు, కందలూరు,మర్లపాడు, ఎం. నిడమనూరుతో పాటు 52 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 16. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.