News September 1, 2025

ప్రకాశం ఎస్పీ స్పందనకు అనూహ్య స్పందన

image

ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీ-కోసం కార్యక్రమానికి భారీగా ఫిర్యాదుదారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ స్వయంగా వారి ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఎస్పీ మీ-కోసం కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరం వాటిని పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సూచించారు.

Similar News

News September 2, 2025

జాన్ వెస్లీకి నివాళులర్పించిన ప్రకాశం ఎస్పీ

image

ఒంగోలులోని చర్చి కూడలి వద్ద గల జాన్ వెస్లీ ఐపీఎస్ విగ్రహానికి మంగళవారం జిల్లా ఎస్పీ దామోదర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. YSR భద్రతా అధికారిగా విధులు నిర్వహించిన జాన్ వెస్లీ హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్సార్‌తోపాటు ప్రాణాలు అర్పించి అమరులయ్యారు. ఈ నేపథ్యంలో జాన్ వెస్లీ 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఎస్పీ దామోదర్ నివాళులు అర్పించారు.

News September 2, 2025

ప్రకాశం జిల్లాలో మెరుపు దాడులు.!

image

ప్రకాశం జిల్లాలో ఎరువుల కేంద్రాలపై, యూరియా నిల్వలపై పోలీసులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా SP దామోదర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. సాయంత్రానికి తనిఖీల ద్వారా షాపులపై చర్యలు తీసుకుంటారా అన్నది పోలీస్ అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ తనిఖీల్లో DSPలు, CIలు, SIలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

News September 2, 2025

మార్కాపురం: ప్రయాణికుడి కోసం రైలు వెనక్కి నడిపారు

image

గజ్జలకొండ-మార్కాపురం సెక్షన్లో సోమవారం రాత్రి రైల్వే సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. రేపల్లెకు చెందిన కుటుంబం కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరు నుంచి బయలుదేరారు. ప్రయాణికుడు అదుపుతప్పి కింద పడిపోగా.. కుటుంబీకులు చైన్ లాగి సిబ్బందికి సమాచారమిచ్చారు. ఆ మార్గంలో మరో రైలుకు సిగ్నల్ ఇవ్వకుండా చర్యలు తీసుని రైలును సిబ్బంది కి.మీ వెనక్కి తీసుకెళ్లారు. బాధితుడిని MRK స్టేషన్లో దించి ఆసుపత్రికి తరలించారు.