News May 28, 2024

ప్రకాశం: ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజిల్లో 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పత్రాలను ప్రింట్ తీసుకోని తమ వద్ద ఉంచుకోవాలన్నారు. 

Similar News

News October 1, 2024

అక్టోబర్ 2 నుంచి గ్రామ సభలు: ప్రకాశం కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టే పనులను గుర్తించేందుకు అక్టోబర్ 2వ తేదీ గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి సోమవారం మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రజల అభిప్రాయాలను, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాస్తవ ప్రణాళికలు రూపొందించాలన్నారు.

News October 1, 2024

కావలిలో రోడ్డు ప్రమాదం.. ప్రకాశం విద్యార్థిని మృతి

image

ప్రకాశం(D) పొన్నలూరు (M) చెరుకూరుకు చెందిన కృపాకర్, మైథిలి అనే ఇద్దరు సోమవారం ఒంగోలు నుంచి నెల్లూరుకు స్కూటీపై వెళ్తుండగా కావలి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి నెల్లూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మైథిలి మృతి చెందింది. కృపాకర్‌కి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలు పదో తరగతి చదువుతోంది. కావలి రూరల్ SI బాజీ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 1, 2024

ప్రకాశం జిల్లాలో పింఛన్ల పంపిణీకి రూ.122.64 కోట్లు మంజూరు

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అక్టోబర్ నెలకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని 2,88,144 మంది లబ్ధిదారులకు రూ.122.64 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ అన్సారియా తెలిపారు. 2వ తేదీ గాంధీజయంతి కావడంతో 1న పింఛన్లు పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు .ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలన్నారు.