News November 13, 2024

ప్రకాశం కలెక్టర్‌తో భేటీ అయిన దామచర్ల సత్య

image

ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో ఉన్న కలెక్టరేట్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియాను మంగళవారం సాయంత్రం రాష్ట్ర మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య కలిసి పలు ప్రజా సమస్యలపై చర్చించారు. కొండపి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సత్య కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు సత్య అందజేశారు.

Similar News

News November 4, 2025

రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి విద్యార్థి ఎంపిక

image

SGFI రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి మారావతు సుదర్శన్ ఎంపికైనట్లు HM పి. కరీమున్ బీబీ తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి చెస్ పోటీలలో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థికి అభినందనలు తెలియజేశారు.

News November 4, 2025

ప్రకాశం: మద్యం దుకాణాల లైసెన్సుల కొరకు.. దరఖాస్తుల ఆహ్వానం!

image

జిల్లాలోని పొదిలి, దర్శి, కనిగిరి, కంభం ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలో 4 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. జిల్లాలోని ఒంగోలు, చీమకుర్తి, సింగరాయకొండ, పొదిలి, దర్శి, మార్కాపురం, కనిగిరి, వై పాలెం, గిద్దలూరు, కంభం స్టేషన్ల పరిధిలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా పదో తేదీలోగా దరఖాస్తులను సమర్పించవచ్చన్నారు. 12న ఒంగోలులో లాటరీ తీస్తామన్నారు.