News September 22, 2025

ప్రకాశం కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబును జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జిల్లా కలెక్టర్, ఎస్పీలు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు పలు అంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్‌కు మొక్కను ఎస్పీ అందజేశారు.

Similar News

News September 22, 2025

టంగుటూరు వద్ద ప్రమాదం.. ఇద్దరి మృతి

image

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వెళ్తున్న బైక్‌- లారీ ఢీకొన్నాయి. టంగుటూరి SI నాగమల్లేశ్వరరావు గాయాలైనవారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. మృతులు పుల్లారెడ్డిపాలెంకి చెందిన బొడ్డు వెంకటేశ్వర్లు, వెంకటాయపాలెంకి చెందిన చొప్పర శ్రీనుగా గుర్తించారు.

News September 22, 2025

కొనకనమిట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు గ్రామ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ లారీ ఢీకొన్నాయి. అయితే బైకర్ తలపైకి లారీ ఎక్కడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పొదిలికి చెందిన శ్రీనివాసులుగా పోలీసులకు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 22, 2025

ప్రకాశం: ఇంటర్ కాలేజీలకు RIO వార్నింగ్

image

ప్రకాశం జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని RIO ఆంజనేయులు అన్నారు. కలెక్టరేట్ వద్ద సర్టిఫికెట్ల కోసం నిరసన తెలిపిన విద్యార్థినికి సంబంధిత కళాశాల యాజమాన్యంతో మాట్లాడి సర్టిఫికెట్లు అందించారని చెప్పారు. ఇలాంటి చర్యలకు ఏ కళాశాల పాల్పడినా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.