News August 28, 2025
ప్రకాశం: క్రీడా ప్రతిభ అవార్డులకు ఎంపికైన పాఠశాలలు ఇవే.!

జిల్లాలో ఈనెల 29న నిర్వహించే విజార్డ్ ఆఫ్ ద హాకీ ఈవెంట్‌కు క్రీడా ప్రతిభ అవార్డులను అందించేందుకై 5 పాఠశాలలను ఎంపిక చేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. గురువారం డీఈవో విడుదల చేసిన ప్రకటన మేరకు.. గొట్ల గట్టు జడ్పీహెచ్ఎస్ మొదటి స్థానంలో, గురవాజిపేట జడ్పీహెచ్ఎస్ 2వ స్థానం, పాకల జడ్పీహెచ్‌ఎస్ 3వ స్థానం, చిర్రీకూరపాడు జడ్పీహెచ్ఎస్ 4వ స్థానం, ఈతముక్కల జడ్పీహెచ్ఎస్ 5వ స్థానంలో నిలిచాయి.
Similar News
News August 28, 2025
పటిష్ఠంగా వెరిఫికేషన్ చేయండి: ప్రకాశం జేసీ

ఒంగోలు రూరల్ పరిధిలోని శ్రీసరస్వతి జూనియర్ కళాశాలను జేసీ గోపాలకృష్ణ సందర్శించారు. డీఎస్సీ-2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పటిష్ఠంగా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట డీఈవో కిరణ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
News August 28, 2025
ప్రకాశం ఎస్పీ కార్యాలయంలో వినాయక చవితి పూజలు.!

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ప్రసాదాన్ని ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News August 27, 2025
ప్రకాశం: రేపే DSC వెరిఫికేషన్.. ఇవి తప్పనిసరి.!

మెగా DSC-2025 మెరిట్ జాబితా అభ్యర్థులకు DEO కిరణ్ కుమార్ బుధవారం సూచనలు చేశారు.
➤మెరిట్ జాబితా AP-DSC వెబ్‌సైట్‌లో చూసుకోవాలి.
➤రేపటి నుంచి ఒంగోలు సరస్వతి జూనియర్ కాలేజీలో వెరిఫికేషన్.
➤అభ్యర్థులు లాగిన్ ఐడీతో కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలి.
➤5 ఫొటోలు, 3సెట్ల జిరాక్సులు, ఒరిజినల్ పత్రాలు తేవాలి.
➤సూచించిన తేదీలో హాజరు కాకుంటే అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.
NOTE: సందేహాలుంటే కామెంట్‌లో తెలపండి.