News October 28, 2025
ప్రకాశం: ‘గర్భవతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

గర్భవతులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధా మారుతి తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల గర్భవతులు అప్రమత్తంగా ఉండాలని, డెలివరీ తేదీకంటే ముందుగానే హాస్పిటల్‌లో చూపించుకోవాలని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని అంగన్వాడీలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరుగుతుందన్నారు. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News October 28, 2025
ప్రకాశం జిల్లాలో పునరావాసాలకు 2900 మంది

తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2900 మందిని తరలించినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం సాయంత్రం ఒంగోలులోని కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. ఒంగోలు నగరంలో 30 లోతట్టు కాలనీలను గుర్తించామని, కోస్తా మండలాల్లో 10 లోతట్టు ఆవాస ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 2 రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ప్రకాశం: జాతీయ రహదారులపై రాకపోకలు నిషేధం

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని జాతీయ రహదారుల్లో భారీ వాహనాల రాకపోకలను రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు SP హర్షవర్ధన్ రాజు ప్రకటన విడుదల చేశారు. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారుల్లో వాహనాల ప్రయాణం నిషేధించడం జరిగిందని, ప్రజా రక్షణ నిమిత్తం తీసుకున్న నిర్ణయాన్ని వాహనదారులు పాటించాలని ఎస్పీ సూచించారు.
News October 27, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. ప్రకాశం వాసులకు కలెక్టర్ సూచన.!

తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా వాసులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
➤అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దు.
➤అనవసర ప్రయాణాలు మానాలి.
➤పిల్లలను వాగుల వద్దకు వెళ్లకుండా చూడాలి.
➤ప్రమాదకర స్థాయిలో వాగులను దాటరాదు.
➤ఈత సరదా కోసం నీటిలో దిగరాదన్నారు.
➤శిధిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించరాదన్నారు.
➤2 రోజులకు అవసరమైన ఆహార పదార్థాలు సమకూర్చాలన్నారు.
➤అత్యవసరసాయానికి 108,104,102కు కాల్ చేయాలన్నారు.


