News March 26, 2024

ప్రకాశం : చంద్రబాబు షెడ్యూల్‌లో మార్పు

image

చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన షెడ్యూల్‌లో మార్పు జరిగింది. తొలుత ఈ నెల 31న మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాలలో ప్రజాగళం పేరుతో పర్యటించనున్నారని ప్రకటించగా ..తాజా షెడ్యూలు ప్రకారం చంద్రబాబు కార్యక్రమం మార్కాపురం వరకే పరిమితం కానుంది. ఆ రోజు ఉదయం నెల్లూరు జిల్లా కావలిలో జరిగే సభలో పాల్గొని అనంతరం చంద్రబాబు హెలికాఫ్టర్లో మార్కాపురం చేరుకొని సభలో ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 19, 2026

ప్రకాశం: నేటి నుంచి రంజాన్.. ఉపవాస వేళలు

image

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభంకానుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేటి ఉపవాస వేళలు ఇలా ఉన్నాయి.
☞ ఒంగోలులో ….
★ సహర్: ఉ.5-5.21
★ ఇఫ్తార్: సా.6.29
★ ఉపవాస కాలం: మొదటి రోజు సుమారు 13 గంటల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.
☞ నోట్: ప్రాంతాలను బట్టి వేళలు కొన్నినిమిషాలు మారొచ్చు.

News February 18, 2026

మార్కాపురం జిల్లా మెడికల్ విద్యార్థిని సూసైడ్

image

మార్కాపురం జిల్లాలో మెడికల్ విద్యార్థిని సూసైడ్ తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నూలు (D) గూడూరు(M) పెంచికలపాడులోని విశ్వభారతి మెడికల్ కాలేజీ సోనిక(22) సూసైడ్ చేసుకుంది. తర్లుపాడుకు చెందిన సోనిక పారామెడికల్ అనస్థీషియా ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండి మంగళవారం హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం SI అఖిల్ కేసు నమోదు చేశారు.

News February 18, 2026

ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

image

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ప్రకాశం భవన్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యం, స్వామిత్వ సర్వేపై సమీక్షించారు. APMAY 2.0 పథకంతో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.