News October 7, 2024

ప్రకాశం జిల్లాకు మూడో స్థానం

image

నెల్లూరులో రెండు రోజులుగా జరుగుతున్న ఆట్యా పాట్యా 9వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఆటలు పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టు మూడో స్థానాన్ని సాధించింది. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను పలువురు అభినందించారు. ప్రకాశం జిల్లా జట్లు మూడో స్థానాన్ని సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆట్యా పాట్యా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నంబూరి శ్రీనివాసులు అన్నారు. భవిష్యత్తులో కూడా మంచి పథకాలు సాధించాలని కోరారు.

Similar News

News October 7, 2024

త్వరపడండి.. ఆలోచిస్తే.. ఆశాభంగం: ఎమ్మెల్యే తాటిపర్తి

image

ఇసుక ధరలపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్(X) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘త్వరపడండి.. ఆలోచిస్తే.. ఆశాభంగం. యర్రగొండపాలెం నియోజకవర్గంలో చంద్రబాబు ఉచిత ఇసుక ధర (18 టన్నులు) రూ.43,200 మాత్రమే. షరతులు వర్తిస్తాయి,’ అంటూ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారాలోకేశ్‌లను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ ఉచిత ఇసుక అనేది బూటకపు మాటలని ఆదివారం పేర్కొన్నారు.

News October 7, 2024

రేపు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాక

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఒంగోలులో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లుగా ఆదివారం మాగుంట కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు స్థానిక రామ్ నగర్‌లో మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. 11 గంటలకు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో జరిగే స్వర్ణాంధ్ర – 2047 జిల్లా స్థాయి విజన్ సంప్రదింపులు, సలహాల సమావేశానికి హాజరవుతారన్నారు.

News October 7, 2024

ఒంగోలు పోలీసులు కొట్టడం వల్లే రాజశేఖర్ చనిపోయారు: నాగేంద్ర

image

ఒంగోలు టూ టౌన్ పోలీసులు కొట్టి అవమానించడం వల్లనే పరుచూరి రాజశేఖర్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర ఆరోపించారు. ఆదివారం ఒంగోలులోని GGHలో రాజశేఖర్ మృతదేహాన్ని పరిశీలించిన ఆయన ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరగాలని.. మృతుడి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.