News December 28, 2025
ప్రకాశం జిల్లాకు వచ్చిన హీరోయిన్ శ్రీలీల

ముండ్లమూరు మండలంలోని కెల్లంపల్లికి ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల వచ్చారు. తన తాత స్వగ్రామమైన కెల్లంపల్లిలోని శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయాన్ని ఆమె సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తాత నివాసానికి వెళ్లి శ్రీలీల కొంతసేపు కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సినీ నటి శ్రీలీల గ్రామానికి రావడంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది.
Similar News
News February 8, 2026
మార్కాపురం: పలకల క్వారీ గుంతలో పడి విద్యార్థి మృతి

మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులలో ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. మిగిలిన విద్యార్థులు భయపడి రోడ్డుపై వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏసుబాబు మృతదేహాన్ని బయటకు తీశారు.
News February 8, 2026
వైఎస్ జగన్‌ను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట

చెన్నైలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ జగన్ మోహన్ రెడ్డి, మాగుంట ఇరువురూ పలకరించుకున్నారు. మాగుంటను జగన్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో రాజకీయాలు ఏమి లేవని సమాచారం.
News February 8, 2026
పాకల బీచ్ ఫెస్టివల్ కు రానున్న ప్రముఖ యాంకర్

సింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద ఈనెల 14, 15వ తేదీలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్‌కు ప్రముఖ యాంకర్ సుమ రానున్నారు. ఇదే విషయాన్ని మంత్రి స్వామి సైతం వెల్లడించారు. రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించే ఫెస్టివల్‌కు పలువురు కమెడియన్లు సైతం రానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్న నేపథ్యంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.


