News February 28, 2025

ప్రకాశం జిల్లాకు 123.63 కోట్లు విడుదల

image

ప్రకాశం జిల్లాలో మార్చికి సంబంధించి పింఛన్ నగదు 123.63 కోట్లు విడుదలైనట్లు డీఆర్డీఏ ఇన్‌ఛార్జ్ పీడీ చిరంజీవి తెలిపారు. ఒకటో తేదీన 100% పింఛన్ పంపిణీ చేయాలని.. ఎవరైనా మిగిలిపోతే 3వ తేదీన పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. నగదు పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Similar News

News February 28, 2025

ప్రకాశం: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

ప్రకాశం జిల్లాలో మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐవో సైమన్ విక్టరీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో 5 సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించామని.. అక్కడ ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.

ప్రకాశం: 3 నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలో మార్చి 3వ తేదీ నుంచి ఓపెన్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామని డీఈవో కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో నేరుగా డౌన్లోడ్ చేసుకుని వెళ్లినా పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామన్నారు.

error: Content is protected !!