News April 12, 2025

ప్రకాశం జిల్లాకు 16వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 16236 మంది పరీక్షలు రాయగా.. 12863 మంది పాసయ్యారు. 79 శాతం పాస్ పర్సంటేజీతో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే 16వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 18715 మందికి, 11798 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 19వ స్థానంలో ప్రకాశం జిల్లా నిలిచింది.

Similar News

News February 21, 2026

ప్రకాశం: బిల్లు చెల్లిస్తేనే డెడ్ బాడీని అప్పగిస్తారంట..!

image

నరసరావుపేటలోని ఓ ప్రముఖ గుండె వైద్యశాలలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు (M) కుందుర్తికి చెందిన సాతులూరి పెద్ద ఏడుకొండలు గుండె జబ్బుతో వైద్యశాలలో చేరాడు. నొప్పి తీవ్రం కావడంతో ఏడుకొండలు మృతి చెందాడు. వైద్యశాల యాజమాన్యం మాత్రం బిల్లులు పూర్తిగా చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని పట్టు పట్టడంతో మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు వైద్యశాల వద్ద ఆందోళన చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

News February 21, 2026

ప్రకాశం: మాల్ ప్రాక్టీస్‌కు చెక్.. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు

image

ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హర్షవర్ధన్ రాజు శనివారం తెలిపారు. 79 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రశ్నపత్రాల రవాణా, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత, CC కెమెరాలు, డ్రోన్ నిఘా ఏర్పాటువంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

News February 21, 2026

చదివేది సింగరాయకొండ.. హాజరు కనిగిరి

image

సింగరాయకొండ చైతన్య పాఠశాలలో అనుమానస్పదంగా మృతి చెందిన తౌషిక్ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తౌషిక్ మరణించిన తర్వాత శుక్రవారం రోజు కూడా కనిగిరిలో ప్రగతి విద్యా నిలయంలో పాఠశాలకు వచ్చినట్లు హాజర వేశారు. త్రిసభ్య కమిటీలో ఉన్న డీఈవో రేణుక ఇది గమనించి అవాక్కయ్యారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కౌశిక్ తల్లిదండ్రులు అంటున్నారు.