News August 13, 2025
ప్రకాశం జిల్లాలోని కౌలు రైతులకు గుడ్ న్యూస్!

ప్రకాశం జిల్లాలోని అర్హులైన కౌలు రైతులకు CCRC కార్డులు మంజూరు చేయాలని JC గోపాలకృష్ణ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ నుంచి మంగళవారం మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వ్యవసాయ సీజన్లో రైతులకు ఎరువుల కొరత రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అధికారులు సమన్వయంతో పనిచేసి కౌలు రైతులకు కార్డులను మంజూరు చేయాలన్నారు.
Similar News
News August 13, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. ప్రకాశం కలెక్టర్‌కు మంత్రి స్వామి ఫోన్..!

ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో మంత్రి డాక్టర్ స్వామి బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆయన కోరారు.
News August 13, 2025
జిల్లాలో జీఎస్టీ వసూళ్లు పెంచాలి: కలెక్టర్

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కమర్షియల్ టాక్స్ శాఖ అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ. 40 లక్షలు, రూ. 20 లక్షల టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. పన్ను లేకుండా సరుకుల రవాణా జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
News August 13, 2025
సంతనూతలపాడు: ఆటో బోల్తా.. మహిళ మృతి

సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద బుధవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన పెండ్ర కోటమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.