News March 28, 2025

ప్రకాశం జిల్లాలోనే అధిక ఎండలు

image

ప్రకాశం జిల్లాలో గురువారం ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగింది. రాష్ట్రంలో అధిక ఎండలు ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నేడు పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఎండలకు బయటకు వెళ్లేముందు, గొడుగు, టోపీలు వాడాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలోని పలు మండలాల్లో ఉదయం మంచు కురవడం గమనార్హం.

Similar News

News March 31, 2025

మార్కాపురంలో క్షుద్ర పూజల కలకలం

image

మార్కాపురం దసరా మండపం సమీపంలో క్షుద్ర పూజలు ఆదివారం కలకలం రేపాయి. ఉగాది పండుగ రోజు అటుగా వెళ్లిన స్థానికులు పసుపు కుంకుమ, నిమ్మకాయలు కొబ్బెర చిప్పలు వేసి పూజలు చేసినట్లుగా గుర్తించారు. శనివారం అమావాస్య కావడంతో క్షుద్ర పూజలు జరిగాయని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూజలు జరిగిన ప్రాంతంలో పంప్ హౌస్‌లో పని చేసేవారు ఈ విషయం తెలిసి ఆందోళన చెందారు. పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.

News March 30, 2025

ఒంగోలులో ఘనంగా ఉగాది వేడుకలు

image

ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇందులో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, MLA విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

News March 30, 2025

కంభం : కరెంటు వైర్లు తగిలి వ్యక్తి మృతి

image

కంభం మండలంలోని లింగాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. కుందేళ్ల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి వెలిగొండయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కుందేళ్ల వేట కోసం స్వయంగా తానే పెట్టిన కరెంటు వైర్లను ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. శనివారం రాత్రి ఈ ఘటన జరగగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.

error: Content is protected !!