News March 19, 2024

ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటా‌ లోడు వ్యాను ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైకు మీద ఉన్న ఇద్దరు యువకులు డివైడర్‌ మీద పడి అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ భక్తవత్సల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 4, 2025

రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి విద్యార్థి ఎంపిక

image

SGFI రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి మారావతు సుదర్శన్ ఎంపికైనట్లు HM పి. కరీమున్ బీబీ తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి చెస్ పోటీలలో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థికి అభినందనలు తెలియజేశారు.

News November 4, 2025

ప్రకాశం: మద్యం దుకాణాల లైసెన్సుల కొరకు.. దరఖాస్తుల ఆహ్వానం!

image

జిల్లాలోని పొదిలి, దర్శి, కనిగిరి, కంభం ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలో 4 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. జిల్లాలోని ఒంగోలు, చీమకుర్తి, సింగరాయకొండ, పొదిలి, దర్శి, మార్కాపురం, కనిగిరి, వై పాలెం, గిద్దలూరు, కంభం స్టేషన్ల పరిధిలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా పదో తేదీలోగా దరఖాస్తులను సమర్పించవచ్చన్నారు. 12న ఒంగోలులో లాటరీ తీస్తామన్నారు.