News August 16, 2024
ప్రకాశం జిల్లాలో ఆరుగురు ఎస్సైల బదిలీలు

ప్రకాశం జిల్లాలో ఆరుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఆరుగురు ఎస్సైలను వీఆర్‌కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
➤ పుల్లలచెరువు – ఫాతిమా
➤ పొదిలి – కోటయ్య
➤ మార్కాపురం రూరల్ – వెంకటేశ్వర నాయక్
➤ దర్శి – సుమన్
➤ జరుగుమల్లి – వెంకట్రావు
➤ పొన్నలూరు – రాజేష్
Similar News
News November 12, 2025
జిల్లాలో 7372 ఇళ్ల నిర్మాణం పూర్తి: ప్రకాశం కలెక్టర్

జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 7372 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని కలెక్టర్ రాజా బాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణాలకు సంబంధించి బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గృహాల నిర్మాణం ద్వారా రూ. 17.77 కోట్ల ఆర్థిక ప్రయోజనం లబ్ధిదారులకు మేలు జరిగిందన్నారు. వివిధ నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న 11,443 మందికి రూ.18.36 కోట్ల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించిందని తెలిపారు.
News November 12, 2025
తెలంగాణలో ప్రకాశం జిల్లా వాసి మృతి

ప్రకాశం జిల్లా వాసి జగిత్యాల జిల్లాలో మృతి చెందిన ఘటన మంగళవారం జరింగింది. జిల్లాలోని బీర్పూర్ (M) చిన్నకొల్వాయిలో లిఫ్ట్ ఇరిగేషన్ బావిలో పడి వలస కూలీ మృతి చెందాడు. కాగా మృతుడు ప్రకాశం జిల్లా కలికివాయ బిట్రగుంటకి చెందిన రామకృష్ణ(52)గా గుర్తించారు. ఇతనితోపాటు మరికొంతమంది బావిలో ఇసుక పూడిక తీస్తుండగా రామకృష్ణ ప్రమాదవశాత్తు బావిలో మృతి చెందాడు. కాగా బీర్పూర్ SI, పరిశీలించి కేసు నమోదు చేశారు.
News November 11, 2025
ప్రకాశం: ఉండవల్లికి బయలుదేరిన సీఎం

ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో MSME ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు వచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో ఆయన పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు నీరు తెచ్చి కనిగిరిని కనకపట్నంగా తీర్చుదిద్దుతానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాలో MSME ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఉండవల్లికి బయలుదేరారు.


