News April 12, 2024
ప్రకాశం జిల్లాలో ఎస్ఈసీ ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ప్రకాశం జిల్లాలో గురువారం మధ్యాహ్నం పర్యటించారు. తొలుత గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ సమీపంలో ఉన్న చెక్ పోస్టును ఆయన తనిఖీ చేశారు. రోజువారి నిర్వహిస్తున్న రిజిస్టర్‌ను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్, జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు.
Similar News
News April 22, 2025
ఒంగోలు: ఆ విద్యార్థులకు నేడే చివరి గడువు

DELED 4వ సెమిస్టర్ విద్యార్థులు నేటి సాయంత్రంలోపు పరీక్ష ఫీజును చెల్లించాలని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా నేటి సాయంత్రం ఐదు గంటల లోపు రూ.250 పరీక్ష ఫీజును చెల్లించాలని పేర్కొన్నారు. రూ.250ఫైన్‌తో ఈనెల 27వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని పేర్కొన్నారు.
News April 22, 2025
ప్రకాశం: వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

ప్రకాశం జిల్లాలో వేర్వేరు ఘటనల్లో సోమవారం ముగ్గురు మృతి చెందారు. పామూరులో బాల భవేశ్ తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కాపురంలోని కాశీ రావు మానసిక స్థితి సరిగా లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు గ్రామానికి చెందిన అరవింద్ చెన్నైలో చదువుకుంటూ నీటిలో మునిగి మృతి చెందాడు.
News April 22, 2025
ఒంగోలు: పోలీస్ గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ ఏఆర్ దామోదర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను సావధానంగా విన్నారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను చట్ట పరిధిలో ఉండడంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.