News April 16, 2024
ప్రకాశం జిల్లాలో ఓటు నమోదుకు 8,320 దరఖాస్తులు

ప్రకాశం జిల్లాలో వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఈ క్రమంలో జిల్లాలోని 8 నియోజకవర్గాల నుంచి ఓటు హక్కు నమోదు కోసం 8,320 దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. వీటిని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు పరిశీలించి సంబంధిత బిఎల్ఓలకు పంపారు. వారం రోజుల్లో ఓటు హక్కు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను విచారణ చేసి అర్హత ఉంటే ఓటు హక్కు కల్పించనున్నారు.
Similar News
News April 22, 2025
ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 29,602 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 22, 2025
ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా బిక్షాటన చేస్తుంటుందని స్థానికులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 22, 2025
S.N పాడు: అధ్యాపక పోస్టులకు నేడే ఇంటర్వ్యూలు

సంతనూతలపాడు మండలం మైనంపాడు డైట్ కళాశాలలో అధ్యాపక పోస్టులకు నేడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు డిప్యూటేషన్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.