News October 1, 2025

ప్రకాశం జిల్లాలో క్రాకర్స్ దుకాణాలపై తనిఖీలు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అక్రమ బాణసంచా నిల్వలకై పోలీసులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో.. ఎవరైనా అనుమతులు లేకుండా బాణసంచా తయారీ, నిల్వ చేస్తున్నారనే కోణంలో పోలీసుల తనిఖీలు చేశారు. తనిఖీలపై ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపుల యజమానులు తప్పక నిబంధనలు అనుసరించాలన్నారు.

Similar News

News October 1, 2025

అంకుల్ మీతో వస్తాం.. అన్నం పెడతారా!

image

తల్లిని కోల్పోయారు. తండ్రి ఆదరణ లేదు. ఆ ఇద్దరు చిన్నారులకు దిక్కుతోచని స్థితి. ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లే దారిలో హెల్ప్ సంస్థ పీడీ సాగర్‌కు ఆ ఇద్దరూ తారసపడ్డారు. ఒకరు 7 ఏళ్ల బాలుడు. మరొకరు 8 ఏళ్ల బాలిక. వీరిని సాగర్ పలకరించి వివరాలు కోరగా అమ్మ చనిపోయిందని, నాన్న ఎక్కడున్నాడో తెలియదని చెప్పారు. ‘అంకుల్ మీతో వస్తాం. అన్నం పెడతారా’ అని కోరడంతో ఆయన వారిని ఒంగోలు బొమ్మరిల్లులో చేర్పించారు.

News October 1, 2025

ప్రకాశం జిల్లాలో టీచర్ పోస్టుల ఖాళీలపై కసరత్తు

image

ప్రకాశం జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల వివరాలను డీఈవో కిరణ్ కుమార్ సేకరిస్తున్నారు. DSC-2025లో నూతనంగా పోస్టులు సాధించిన అభ్యర్థులకు ఈనెల 3 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. చివరి రోజు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అసలు టీచర్స్ లేకుండా సర్దుబాటుపై నడుస్తున్న పాఠశాలలకు తొలి ప్రాధాన్యత ఇచ్చేలా, నిష్పత్తి ఆధారంగా ఖాళీలు భర్తీ చేయనున్నారు.

News October 1, 2025

ప్రకాశం ఎస్పీని కలిసిన వైసీపీ నేతలు

image

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయనను వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, వైసీపీ మార్కాపురం ఇన్‌ఛార్జ్ అన్నా రాంబాబు తదితర నేతలు కలిశారు. శాంతి భద్రతలపై ఆయనతో మాట్లాడారు.